కృష్ణా: కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత అందే శ్రీరామ్ మూర్తి ఈరోజు నియమితులయ్యారు. ఇటీవల ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఈయన అవనిగడ్డ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మూర్తికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.