E.G: సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నిడదవోలులో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్వయంగా పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.