AKP: నాతవరం మండల ప్రత్యేకాధికారి మంగవేణి, తహసీల్దార్ వేణుగోపాల్ శనివారం మండలంలోని గన్నవరం పీఏసీఎస్, పీకే.గూడెంలోని ప్రైవేటు యూరియా దుకాణాలను సందర్శించారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీవ ఎరువులు, నానో యూరియాపై అవగాహన కల్పించారు. తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తికి దారితీసే గ్రాన్యులర్ యూరియా అధిక వినియోగాన్ని తగ్గించాలని చెప్పారు.