E.G: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. బంగాళాపేటకు చెందిన గునుపే కిరణ్ పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో జరుగుతోందని తెలిపారు.