ASR: అరకు మండలం మాడగడ వ్యూ పాయింట్ వద్ద స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధికారులకు సూచించారు. గురువారం మాడగడలో పర్యటించారు. పర్యాటక ప్రదేశంలో టీ, కాఫీ, భోజనం, ఇతర వంటకాలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నామని స్థానికులు తెలిపారు. అయితే ఇప్పుడు అధికారులు ఇక్కడ అలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కోరారు.