కృష్ణా: రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. కోడూరు మండలం విశ్వనాథ పల్లిలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. అయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ప్రణాళికతో యూరియా సరఫరా చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ప్రెసిడెంట్ తోట సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.