AKP: కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో గొబ్బూరు గ్రామంలో బెల్ట్ షాపుపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈ దాడిల్లో 10 క్వార్టర్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్ట్ షాపు నిర్వహిస్తున్న దయాచంద్ పై కేసు నమోదు చేశామన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.