KRNL: ఈనెల 17న కర్నూలు నగరం అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కోర్ కమిటీ, జిల్లా నాయకులకు సమావేశం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. సమావేశంలో ఎస్టీ హక్కుల సాధనకు అవసరమైన వ్యూహ రచనపై చర్చిస్తారన్నారు. సమావేశానికి సంఘం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.