కృష్ణా: కార్డియో పల్మనరీ పునరుజ్జీవనం (సీపీఆర్) విద్యార్థులు అందరూ అవగాహన కలిగి ఉండాలని అవనిగడ్డ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ దొరబాబు అన్నారు. ఈ మేరకు జూనియర్ కాలేజీలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించే సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి ఒత్తిడికి లోనైనప్పుడు రక్తప్రసరణ ఆగిపోతుందని అన్నారు.