గుంటూరు: సంగడిగుంటకు చెందిన మేజర్ భరద్వాజ్ రాజస్థాన్లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ మరణించిన విషయం విధితమే. ఈ మేరకు SP వకుల్ జిందాల్ ఆయన నివాసానికి వెళ్లి, అతని పార్థివ దేహానికి పోలీస్ శాఖ తరఫున గౌరవ వందనం సమర్పించి నివాళులర్పించారు. దేశ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ దేశ సేవలో అసువులు బాసిన భరద్వాజ్ అందరికీ స్ఫూర్తిదాయకులని SP పేర్కొన్నారు.