ATP: ‘అన్నదాత పోరు’ పోస్టర్లను జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరత, బ్లాక్‌మార్కెట్, విత్తనాల సమస్యలతో రైతులు బాధపడుతున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 9న అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.