దసరా సందర్బంగా కర్నూల్ జిల్లా దేవరగట్టులో రాత్రి జరిగిన కర్రల సమరం(Stick fight)లో హింస చెలరేగింది. ఉత్సవాన్ని వీక్షిస్తున్న సమయంలో సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టు (Neem tree)పైకి భక్తులు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో చెట్టు కొమ్మ విరిగిపోయింది. దీంతో చెట్టు మీద నుంచి పలువురు భక్తులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్(Hospital)కు తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో డిర్రర్ .. గోపరాక్.. అనే శబ్దాలతో దేవరగట్టు మారుమోగింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టు(Devaragattu)లో మరోసారి సంప్రదాయమే గెలిచింది. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర (Maharashtra) ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.