»Decoration In The Name Of Jagan On Tirupati Gangamma Temple Chandrababu Fire
Chandrababu: తిరుపతి గంగమ్మ ఆలయంపై జగన్ పేరుతో ముస్తాబు..చంద్రబాబు ఫైర్
గంగమ్మ ఆలయం వద్ద జగన్(Jagan) అనే అర్థం వచ్చేలా..J అని రాసి దానికి పక్కనే గన్ బొమ్మ వేయడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంతేకాకుండా ఆ పేరుకు పక్కనే వైసీపీ(YCP) జెండా కూడా వేశారు. ఆలయం వద్ద ఇలా పార్టీ గురించి చెప్పడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి గంగమ్మ జాతర(Tirupathi Gangamma jathara)కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ఏడాది కూడా ఈ గంగమ్మ జాతర వేడుకగా ప్రారంభమైంది. తాతయ్యగుంట గంగమ్మ జాతర చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది భక్త జనం తరలి వస్తున్నారు. అయితే ఆలయం ముందు వేసిన అలంకారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
గంగమ్మ ఆలయం వద్ద జగన్(Jagan) అనే అర్థం వచ్చేలా..J అని రాసి దానికి పక్కనే గన్ బొమ్మ వేయడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంతేకాకుండా ఆ పేరుకు పక్కనే వైసీపీ(YCP) జెండా కూడా వేశారు. ఆలయం వద్ద ఇలా పార్టీ గురించి చెప్పడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu naidu) స్పందించారు. తిరుపతి గంగమ్మ గుడి(Tirupathi Gangamma Temple)కి ఇలాంటి అలంకారం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవత సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ జెండా గుర్తులు ఏంటని నిలదీశారు. జె అక్షరానికి గంగమ్మకు ఎటువంటి సంబంధం ఉందని ప్రశ్నించారు. ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ల దగ్గర ఇలాంటి వేషాలు వేయడం ఏంటని నిప్పులు చెరిగారు.