»A Huge Crowd Of Devotees Reached Tirumala Queue Line For Kilometers
Tirumala: తిరుమలకు చేరుకున్న భారీ భక్తజనం.. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటుగా నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
తిరుమల(Tirumala)లో భక్తుల(Devotees) తాకిడి ఒక్కసారిగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు రావటంతో తిరుమలకు భక్తులు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vykuntam complex) లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయని టీటీడీ(TTD) తెలిపింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటుగా నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. విద్యార్థులకు వేసవి సెలవులు(Summer Holidays) కావడం వల్ల కుటుంబ సమేతంగా అందరూ శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్నారు.
భక్తుల తాకిడి ఎక్కువవ్వడంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. కాలినడకన కొండపైకి వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు, రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లు(Special Entry Dharshan Tickets) ఉన్నవారికి 7 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ(TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.