Mangalsutra : పెళ్లైన మహిళలు మంగళసూత్రం ఎందుకు ధరిస్తారో తెలుసా ?
హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ మెడలో మంగళసూత్రం(తాళి) కడితే పెళ్లి జరిగినట్లు. అసలు పెళ్లిలో మంగళసూత్రం ఎందుకు కడతారు..? పెళ్లి తర్వాత మహిళలు ఆ మంగళసూత్రాన్ని ఎందుకు ధరించాలి..?
Mangalsutra : హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ మెడలో మంగళసూత్రం(తాళి) కడితే పెళ్లి జరిగినట్లు. అసలు పెళ్లిలో మంగళసూత్రం ఎందుకు కడతారు..? పెళ్లి తర్వాత మహిళలు ఆ మంగళసూత్రాన్ని ఎందుకు ధరించాలి..? దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.. భారతీయ సంప్రదాయం ప్రకారం మంగళసూత్రం అనేది స్త్రీలు ధరించాల్సిన 5 వస్తువులలో ఒకటి, దానితో పాటుగా పట్టీలు, కుంకమ, కంకణాలు, ముక్కుపడక వీటన్నింటినీ పెళ్లైన స్త్రీ కచ్చితంగా ధరించాలట. కొత్తగా పెళ్లయిన స్త్రీకి ఇతర అన్ని ఆభరణాలలో, మంగళసూత్రం చాలా ముఖ్యమైనది. మంగళ్ అంటే పవిత్రమైనది, మంచిది. సూత్రం అంటే దారం. అందువల్ల, మంగళసూత్రం అనేది హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి వివాహిత అమ్మాయి/స్త్రీ ధరించవలసిన పవిత్రమైన దారం.
మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతిజ్ఞ. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, ఆమె తన వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మంగళసూత్రం లో ఆ నల్లపూసలు ఎందుకో తెలుసా? ఈ పూసలు లేకుండా పవిత్రమైన దారం అసంపూర్ణంగా ఉంటుంది. ఇది శివుడు, అతని భార్య పార్వతి మధ్య బంధానికి చిహ్నంగా పరిగణిస్తారు. మంగళసూత్రంలోని బంగారం పార్వతి దేవిని సూచిస్తుంది. నల్లపూసలు శివుడిని సూచిస్తాయి. సాంప్రదాయకంగా, మంగళసూత్రంలో 9 పూసలు ఉంటాయి, ఇవి 9 విభిన్న శక్తులను సూచిస్తాయి. ఈ శక్తులు భార్యాభర్తలను దుష్టశక్తుల నుండి కాపాడతాయి. ఈ పూసలు గాలి, నీరు, భూమి, అగ్ని అన్ని మూలకాల శక్తిని కలిగి ఉంటాయి. ఈ కారకాలు స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. మంగళసూత్రానికి దైవ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. బంగారం, కరిమణి కలయిక భార్యాభర్తలను దుష్టశక్తి నుండి కాపాడుతుంది.
మంగళసూత్రం ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.మంగళసూత్రం బంగారం, కరిమణి కలయిక. బంగారం అనేది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంగళసూత్రాన్ని గుండెకు దగ్గరగా ధరించినప్పుడు, అది విశ్వ తరంగాలను ఆకర్షిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ తరంగాలు భార్యాభర్తలు ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి. మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా స్త్రీ శరీరంలోని రక్తపోటు అదుపులో ఉంటుంది. మంగళసూత్రంలోని నల్లపూసలు నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి.