ASR: అనంతగిరి మండలంలోని కొండిభలో సెల్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మాణం చేపట్టి ఏడాది అవుతున్నా సెల్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలన్నా, ఈకేవైసీ, తదితర పనులు చేసుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.