ELR: జిల్లా నుండి ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా జిల్లా, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శనివారం కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా ఉందన్నారు.