తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు. తాజాగా కాలేజీలకు సైతం సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సైతం హాలిడే ఇచ్చారు. ఆ జిల్లాలోని కాలేజీ సెలవులపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.