»Date Fixed For Deputy Cm Pawan Kalyans Visit To Kondagattu
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటన డేట్ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 29 కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఆ తరువాత పిఠాపురంలో పర్యటించనున్నారు.
Date fixed for Deputy CM Pawan Kalyan's visit to Kondagattu
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించిననున్నారు. జూన్ 29న ఆయన కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం హనుమాన్ సన్నిధిలో పూజ నిర్వహించుకొని అనంతరం పిఠాపురంలో పర్యటించనున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా ఆయన 11 రోజుల పాటు కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే ఆహారంగా తీసుకోంటారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు నిర్వహించారు.
ఏపీ ఎన్నికల్లో ఆయన విజయదుంధుబి మోగించారు. అఖండ విజయంతో కూటమి అధికారంలోకి రావడంతో ప్రభుత్వం జనసేన కీలక పాత్ర వహిస్తుంది. ఇక కొండగట్టు దర్శనం తరువాత పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. అదే రోజున వారాహి సభను ఏర్పాటు చేసిన తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకోనున్నారు.