»Cm Chandrababu Naidu Picking The Heap To Develop A Backward Area
CM Chandrababu Naidu: వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నా!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
CM Chandrababu Naidu: Picking the heap to develop a backward area!
CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. కుప్పం వచ్చిన రాకపోయిన నన్ను ఆదరించి.. ఇప్పటివరకు 8సార్లు గెలిపించారన్నారు. అలాగే మండల పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. అహంకారంతో ఉంటే ప్రజాస్వామ్యంలో వైసీపీకు పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారని అన్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కుప్పంను ఎంచుకున్నా అని చంద్రబాబు అన్నారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు.
కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో నిలిపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని.. ఈక్రమంలోనే కేబినేట్లో 8మంది బీసీలకు అవకాశం కల్పించామన్నారు. ఐదేళ్ల నుంచి కుప్పంలో ఎలాంటి అభివృద్ధి లేదని.. ఈరోజు నుంచే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తామని, అలాగే పంట పొలాల వద్దకు రోడ్లు వేస్తామని తెలిపారు. వీలైనంత తొందరలో కుప్పంకు విమానాశ్రయం వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.