AKP: మాజీ మంత్రి దివంగత గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పరవాడలో ఆయన మాట్లాడుతూ.. నిందితులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనక కుట్రకోణం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ధ్వంసం చేసిన విగ్రహాన్ని తక్షణం పునర్నిర్మాణం చేయాలన్నారు.