NTR: నందిగామ మండలం కమ్మవారిపాలెం ఎంపీపీ ఎస్ మెయిన్ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో ఆర్.వీ.ఎస్. ప్రసాదరావు అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో మెనూలో ఉన్న వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ, ఎగ్, చిక్కీ నాణ్యతను పరిశీలించారు. 45 మందిలో 38 మంది విద్యార్థులకు భోజనం అందించారు.