ప్రకాశం: కనిగిరిలోని ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్‌ను వసతులు లేవనే కారణంతో తరలిస్తున్నారని, ఈ చర్యను నిలిపివేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ కలిసి బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ హాస్టల్ మూసివేత ప్రక్రియను విరమించుకోవాలన్నారు. ఎస్సీ హాస్టల్ కనిగిరిలోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.