GNTR: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం తెనాలి చెంచుపేటలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరలుకు అక్బర్, సాయిగోపీ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.