ప్రకాశం: కనిగిరిలోని జడ్పీహెచ్ఎస్లో విధులు నిర్వహిస్తున్న రంగారెడ్డి అనే టీచర్ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై అతనిని అరెస్టు చేశామని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అరెస్టు చేసిన ఉపాధ్యాయుడిని రిమాండ్ నిమిత్తం ఒంగోలుకు తరలించామన్నారు. ఈ విషయమై పట్టణంలో రాస్తారోకోలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు.