SKLM: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ లీడర్ బాలి మధు సుధనరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో టీడీపీ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు మధు ఆయనకు చెప్పారు.