ప్రకాశం: పెద్దారవీడు మండలం సుంకేసులలో టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ను ప్రారంభించారు. అంతకుముందు నాయకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎరిక్షన్ బాబు చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.