ప్రకాశం: బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా నగదు సాయం చేస్తుందని హౌసింగ్ డీఈ కోటిరెడ్డి అన్నారు. కనిగిరి కాశిరెడ్డి కాలనీ సచివాలయంలో బుధవారం గృహనిర్మాణ లబ్ధిదారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. బీసీ, ఎస్సీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పర్వతప్రాంత షెడ్యూలు తెగలకు రూ. లక్ష అదనపు సాయాన్ని గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇస్తుందన్నారు.