కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న వ్యాపారులను డిజిటల్ లావాదేవీలకు మరింతగా ప్రోత్సహించేందుకు రూ.2 వేలలోపు ఉన్న UPI లావాదేవీలపై 0.15% ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. దీంతో చిన్న వ్యాపారులు ఎలాంటి లావాదేవీల ఛార్జీల భారాన్ని లేకుండా UPI వాడుకోవచ్చు. అంతేకాదు, Zero MDR విధానం అమల్లో ఉండటంతో వ్యాపారులు ఎలాంటి అదనపు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు.