ASR: సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మహాత్మగాంధీ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం సాధించడంలో గాంధీ కీలకపాత్ర పోషించారన్నారు. అహింసా పద్దతుల ద్వారా స్వరాజ్యం సిద్ధిస్తుందని నిరూపించారన్నారు.