CTR: వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు నగరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. గత 15 ఏళ్లుగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ అలుపు లేని పోరాటం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.