SKLM: పీఎన్ కాలనీకి చెందిన డి.రాజ్యలక్ష్మి నాగావళి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె ఓ డెంటల్ క్లినిక్‌లో పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చీకటి కారణంగా గాలించినా మహిళ ఆచూకీ తెలియలేదు.