KKD: వ్యవసాయ సాగులో ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య కోరారు. సోమవారం సాయంత్రం తుని మండలం టి. తిమ్మాపురంలో ఆమె ఇద్దరు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందించిన రెండు వ్యవసాయ డ్రోన్లను ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు.