TPT: నారాయణవనం మండలం భీమునిచెరువులో తాను చదువుకున్న పాఠశాలను ఎమ్మెల్యే ఆదిమూలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులేమి స్పష్టంగా కనిపించడంపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలకు అవసరమైన వసతులకు నిధులు కేటాయించాలని జడ్పీ సీఈవోను ఎమ్మెల్యే ఫోన్ ద్వారా కోరారు. అనంతరం క్లాస్ రూములోకి వెళ్లారు. టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.