»Crowd Of Devotees Increased In Tirumala Crowded With Devotees
TTD : తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులతో కిటకిట
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది.
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది. భక్తులకు గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి క్యూలైన్లలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయాయి. వసతి గదులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. సీఆర్ఓ వద్ద గదుల కోసం క్యూలైన్లలో భక్తులు గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా అత్యధిక సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో, భక్తుల కోసం టీటీడీ (TTD) భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, తిరుమలలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రికులు తమ పర్యటనను రూపొదించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సర్వ దర్శనం క్యూలైన్లలో టోకెన్ లేని భక్తులు సంయమనం పాటించాలని సూచించింది.
ప్రయాణాలు మరో రోజుకు వాయిదా వేసుకోవాలని కోరుతోంది. శ్రీవారి ఆలయం(Srivari Temple) ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, గదులు కేటాయించే సీఆర్వో, కల్యాణకట్టలు, అన్నప్రసాద భవనం(Annaprasada Building).. ఎటు చూసినా జనం కనిపించారు. మరోవైపు తిరుమల వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు భక్తులు బస్టాప్‌లలో వేచి ఉంటున్నారు. ఉచిత బస్సులు (Free buses) తక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టలు కిటకిటలాడుతున్నాయి. తలనీలాలు సమర్పించేందుకు రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు లడ్డూకౌంటర్ (Laddu counter) కూడా భక్తుల రద్దీతో దర్శనమిస్తోంది. దర్శనం లభించకపోయినా కనీసం ప్రసాదమైనా తీసుకుందామని క్యూలైన్లలో బారులు తీరారు. మొత్తం మీద తిరుమల క్షేత్రంలో రెండేళ్ల కిందటి దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. షాపింగ్ ప్రాంతాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.
చదవండి :IPL 2023 : సీఎస్కే మ్యాచ్‌తో సచిన్ కొడుకు ఎంట్రీ