కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు హామీకి ఇప్పటివరకు అమలు లేకుండా పోయిందని ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సూచించిన 14శాతం పెంపును అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిమాండ్లను పరిష్కరించాలని విజయవాడ(Vijayawada)లోని ధర్నా చౌక్ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు. ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ (DA) ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఉద్యమమంతా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులదే. ఉద్యమం చేస్తున్నామనే మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఇలా దాడులు చేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా? 84 రోజులుగా ఆందళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
ఉద్యమం ఆగాలంటే డిమాండ్లు పరిష్కరించాల్సిందే. 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రమవుతుంది. అదే జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రమవుతుంది. అదే జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ (PRC) బకాయిలు, డీఏలు అవసరం లేదా?సచివాలయ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండాలా?లేదా?వెంకట్రామిరెడ్డి చెప్పినవన్నీ ప్రభుత్వం చెప్పినట్లుగానే భావిస్తున్నా. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమే” అని బొప్పరాజు (Bopparaju) తెలిపారు