»Chandrababu Warned Ap Tdp Mla Candidates Differences In The Survey The Candidates Will Be Changed
Chandrababu: అభ్యర్థులకు బాబు హెచ్చరిక.. తేడా వస్తే టికెట్ క్యాన్సెల్
ఏపీలో జనసేన-టీడీపీ కూటమి తొలి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా తేడా వస్తే టికెట్ వెనక్కి తీసుకుంటా అని వెల్లడించారు.
Chandrababu warned AP TDP MLA candidates. differences in the survey, the candidates will be changed
Chandrababu: ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) రాజకీయాలు ఒక్క సారిగా హీట్ ఎక్కాయి. శనివారం జనసేన-టీడీపీ కూటమి తొలి జాబితాగా 99 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. 94 స్థానాల్లో టీడీపీ(TDP) పోటీ చేస్తుందని పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. జనసేన మొత్తం 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తూ.. 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. వారితో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక ఆదేశాలతో పాటు పలు హెచ్చరికలు చేశారు.
ఈ 40 రోజులు అత్యంత కీలకమని, అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉండాలని వెల్లడించారు. పనితీరుపై ప్రతి వారం సర్వే చేపడతామని, సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు ఆలోచించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలు, ఎమ్మెల్యేల పనితీరును ఎండగడుతూ.. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని కోరారు. అలాగే జనసేన(Janasena) క్యాడర్ను కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడాలని చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలు, దొంగ ఓట్లను, డబ్బును నమ్ముకున్నారని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు అయినా పన్నుతారని అందరూ అప్రమత్తంగా ఉండాలని వారితో పేర్కొన్నారు.