బాపట్ల: రైల్వే స్టేషన్ కొత్త ద్వారం వద్ద శుక్రవారం ఓ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ వద్ద లారీలు అడ్డుగా నిలపడం వల్ల అటువైపు నుంచి వచ్చే బస్సులు కనబడక తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.