ATP: గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాలన సాగించడం వల్లే ప్రజలు వారిని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం నుంచి ప్రజలకు విముక్తి లభించిందని పేర్కొన్నారు.