»Celebrations Of Tdp Ranks Pawan Kalyan Reacts On The Arrival Of Chandrababu
Pawan Kalyan: టీడీపీ శ్రేణుల సంబరాలు.. బాబు రాకపై స్పందించిన పవన్ కల్యాణ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు అని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Celebrations of TDP ranks.. Pawan Kalyan reacts on the arrival of Chandrababu
Pawan Kalyan: స్కిల్ కేసు(Skill case)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) దాదాపు 52 రోజులు జైలు జీవితం అనుభవించారు. ఆయన అనారోగ్యం దృష్ట్యా ఏపీ హై కోర్టు మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరు చేసింది. బాబుకు బెయిల్ రావడంపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawankalyan) సంతోషాన్ని వ్యక్తపరిచారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం అని ట్వీట్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షడు అచ్చెనాయుడు మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ఏ తప్పు చేయకుండా చంద్రబాబును ఇన్ని రోజులు జైలులో ఉంచడం అన్యాయమన్నారు.
ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బాబుకు స్వాగతం పలికేందుకు రాజమండ్రికి పెద్ద సంఖ్యలో టీడీపీ ముఖ్యనేతలు, అభిమానులు చేరుకుంటున్నారు. రాజమండ్రి జైలు నుంచి భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి పాత హైవే మీదుగా అమరావతిలోని చంద్రబాబు ఇంటికి చేరుకోనున్నారు. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రేపు తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని తరువాత హైదరాబాద్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.