»These Are The Conditions Of The High Court For The Release Of Chandrababu In The Skill Development Case
Chandrababu: సాయంత్రం బాబు విడుదల.. హైకోర్టు షరతులు ఇవే
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది షరతులతో కూడిన బెయిల్.
Chandrababu Has A Heart Problem.. Lawyers told the court
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో(skill development case) ఏపీ హైకోర్టు చంద్రబాబు(Chandrababu )కు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యం దృష్ట్యా షరతులతో కూడిన ఇద్దరు ష్యూరిటీలతో పాటు రూ.లక్ష (బెయిల్ బాండ్‌తో) పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బాబు సొంత ఖర్చులతో ఏ ఆసుపత్రిలోనైనా వైద్య పరీక్షలు చేసుకోవచ్చని పేర్కొంది. చంద్రబాబు వైద్యానికి సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో జైల్ సూపరింటెండెంట్‌కు సమర్పించాలని కోర్టు అదేశాలు జారీ చేసింది. బెయిల్ మీద బయటున్న బాబు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని కేసును ప్రభావితం చేయొద్దని, సాక్షులను కేసుకు సంబంధించిన వ్యక్తులను ఏ విధంగా ప్రలోభాలు గురిచేయొద్దని షరతులు విధించింది. అస్పత్రి మినహా ఇతర కార్యక్రమాల్లో పాల్గోనరాదు అని, చికిత్స అనంతరం నవంబర్ 28న సా.5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశించింది. నవంబర్ 10న రెగ్యూలర్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.
చంద్రబాబుకు బెయిల్ మంజురు కావడంతో టీడీపీ పలువురు నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) మాట్లాడుతూ.. చేయని తప్పుకు 52 రోజులు జైలు శిక్ష అనుభవించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇదే నమ్మకంతో మా నాయకుడు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు అని అన్నారు. బాబు జైలు నుంచి రావడంతో వైసీపీకి శాశ్వత సమాధి కట్టే ప్రక్రియా మొదలౌతుందని పేర్కొన్నారు. ఆయను మధ్యంత బెయిల్ వస్తుందన్న భయంతో మద్యం విషయంలో మరో తప్పుడు కేసు పెట్టారని అచ్చెన్నాయుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆయనతో పాటు ఇతర నేతలు కూడా న్యాయమే గెలుస్తుంది అని మాట్లాడారు.