CTR: పెనుమూరు మండల సింగిల్ విండో అధ్యక్షుడిగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పామూరు శ్రీనివాసులు నూతనంగా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేసిన తనను గుర్తించి పదవి ఇచ్చిన ఎమ్మెల్యే థామస్, రాష్ట్ర మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్నకి కృతజ్ఞతలు తెలియజేశారు.