WG: భీమవరం కలెక్టరేట్లో శనివారం ఎన్టీఆర్ వైద్యసేవ ఫిర్యాదులపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత (క్యాష్ లెస్) సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.