CTR: పలమనేరు మొగిలి ఘాట్ రోడ్డులో మదనపల్లికు వెళుతున్న ఐచర్ వాహనం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఇవాళ వేకువ జామున చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పలమనేరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో.. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.