SKLM: బాల్య వివాహాల పట్ల తల్లిదండ్రులు అవగాహన పరచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీడీఎస్ పిడి విమల, పీవో నాగరాణి తెలిపారు. శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ కళాశాలలో సంకల్పం ముగింపు కార్యక్రమంలో భాగంగా వారు పాల్గొన్నారు. బాల్య వివాహాలు చేయడం వలన ఆడపిల్లలు అనారోగ్యం పాలు కావడంతో పాటు అనతి కాలంలోనే మరణాలు సంభవించే పరిస్థితులు వస్తాయని వివరించారు.