VSP: విశాఖ VMRDA ప్రజా దర్బార్‌కు వచ్చిన వినతులను నిశితంగా పరిశీలించి, వాటిని పరిష్కరించటానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజా దర్బార్‌కి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.