AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం ఆగ్రహారం జంక్షన్లో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఎండిపోయిన చెట్టును వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. స్థానిక జంక్షన్లో విద్యుత్ లైట్లు వెలకకపోవడంతో రాత్రి వేళల్లో అంధకారం అలుముకుంటుందన్నారు.