W.G: ఉండి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ‘రణభేరి 3.0’ నిరాహార దీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శాఖ అధ్యక్షుడు ఆర్.వి.ఎస్. నారాయణ తెలిపారు. ఈ దీక్షలో భాగంగా ఆర్థిక బకాయిల విడుదల, పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టనున్నారు.