AKP: కోటవురట్ల మండలం నీలిగుంట గ్రామానికి చెందిన కన్నం రెడ్డి గోవింద్‌కు సీఎం సహాయ నిధి మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న గోవిందు తీసుకున్న చికిత్సకు అయిన ఖర్చుకు సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత సీఎం సహాయనిది మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు మంజూరైన రూ. 37,515 చెక్కును మండల టీడీపీ అధ్యక్షులు లింగన్నాయుడు మంగళవారం రాత్రి లబ్ధిదారుడికి అందజేశారు.