ప్రకాశం: మార్కాపురం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఎక్సైజ్ కానిస్టేబుల్ నిరసన వ్యక్తం చేశాడు. యర్రగొండపాలెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తనను కులం పేరుతో దూషిస్తూ నిత్యం వేధిస్తున్నాడని శంకర్ నాయక్ అనే కానిస్టేబుల్ ఆరోపించాడు. కార్యాలయ ఆవరణలో బైటాయించి నిరసన వ్యక్తం చేశాడు. తనకు సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపాడు.